యువ హీరో నాగచైతన్య.. గత కొంత కాలం నుంచి బాగా మంచి విజయాలను అందుకుంటున్నాడు. వెంకీ మామ, మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు చైతన్య. అయితే ఇప్పుడు తాజాగా థాంక్యూ సినిమాలో చైతూ సరికొత్త గెటప్లో కనిపించబోతున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ కి దర్శకత్వం వహించారు. చైతన్య సరసన రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్నది. ఇక అంతే కాకుండా అవికాగోర్, మాళవికా నాయర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక అంతే కాకుండా హర్షిత్ రెడ్డి సహా నిర్మాతగా కూడా ఉన్నారు. ఇప్పటికే థాంక్యూ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తి అయినది. అయితే ఈ సినిమా పూర్తయి ఇప్పటికే రెండు నెలలు కావస్తున్నా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. కేవలం నాగచైతన్య ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మాత్రమే విడుదల చేసింది. సమ్మర్ సీజన్ లో ప్రస్తుతం అన్ని చిత్రాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా విడుదల అవుతుందని అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమాపై కొన్ని రూమర్స్ రావడం జరుగుతోంది. ఈ సినిమా ఫుటేజ్ నుండి చాలా రీషూట్ జరుగుతున్నాయని వార్త కూడా వినిపిస్తోంది. ఇక బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడంతో అనేక సమస్యలు వస్తున్నాయి అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక రాశి కన్నా ఈ చిత్రం కోసం సరైన డేట్స్ ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు అవుతున్నట్లుగా కూడా సమాచారం. ప్రస్తుతం రాశి ఖన్నా ఎక్కువగా బాలీవుడ్ పైన దృష్టి పెట్టింది. అయితే ఈ చిత్రం పై సరైన క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: