టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలను వరుసగా చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను పూర్తి చేసిన ఈ హీరో ఇదే క్రమంలో మరో సినిమాను కూడా మొదలుపెట్టి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేశాడు. లైగర్ సినిమాను ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ హీరో డిసెంబర్ 23వ తేదీన ఖుషి చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు.

ఇటీవలే ఈ సినిమా యొక్క షూటింగ్ కాశ్మీర్ లో మొదలు కాగా ఇందులో సమంత కథానాయికగా నటిస్తూ ఉండడం చిత్రంపై ఈ స్థాయిలో బజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం. ఆ విధంగా విభిన్నమైన ప్రేమకథ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఇంకొకవైపు యాక్షన్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే మరొక సినిమా కూడా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ.

ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమాను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఆయన సినిమాల్లో ఎక్కువగా బాలీవుడ్ కల్చర్ ఉండడం జరుగుతూ ఉన్నట్లుగా కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. టాలీవుడ్ హీరోల స్టైల్ కాకుండా ఆయన సినిమాలలో బాలీవుడ్ హీరోల స్టైల్ ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదేమైనా ఈ స్థాయిలో సినిమాలు చేసే స్థాయికి విజయ్ దేవరకొండ ఎదగడం నిజంగా గొప్ప విశేషం అని ఆయన అభిమానులు చెబుతున్నారు. మాస్ మాసాలా సినిమాల్లో నటిస్తే పూర్తిస్థాయి స్టార్ హీరో గా మారే ఆ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సుకుమార్ దర్శకత్వంలో అలాంటి తరహా సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సాధిస్తుందో చూడాలి. దానికంటే ముందే రెండు మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్ దేవరకొండ. 

మరింత సమాచారం తెలుసుకోండి: