ప్రస్తుతం ప్రేక్షకులు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో మూవీ లను చూడడానికి సినీ ప్రేమికులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు,  దానికి ప్రధాన కారణం...  మంచి క్రేజ్ ఉన్న సినిమాలు కూడా అతి తక్కువ కాలంలోనే ఏదో ఒకటి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రావడం మరియు చిన్న సినిమాలు అయితే మరీ తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి రావడంతో ప్రేక్షకులు 'ఓ టి టి' లలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే కొన్ని స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా కూడా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ లను కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే రాబడుతోంది.  

ఇప్పటికే భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మంచి విజయాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర హవా చూపిస్తున్న మహేష్ బాబు మరొక సారి సర్కారు వారి పాట సినిమాతో మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.  ఇది ఇలా ఉంటే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన సర్కారు వారి పాట సినిమా ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 10 వ తేదీ న లేదా జూన్ 24 వ తేదీన స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: