టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సి న అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తమ కెరీర్ లో ఎన్నో రీమిక్ మూవీలలో నటించారు. అందులో కొన్ని మూవీలు విజయాలను సాధించగా ,  మరికొన్ని మూవీ లు అపజయం పాలు కూడా అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీమిక్ మూవీ ల గురించి తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తరువాత చిరంజీవి తమిళంలో సూపర్ హిట్ గ నిలిచిన కత్తి మూవీ ని తెలుగు లో ఖైదీ నెంబర్ 150 మూవీ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ మూవీ ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమిక్ చేసి విడుదల చేశాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ ని బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకొని  అద్భుతమైన కలెక్షన్ లను  బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" మూవీ తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హిందీ సినిమా పింక్ కి రీమేగా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనున్ కోషియన్ మూవీ ని తెలుగు లో భీమ్లా నాయక్ మూవీ తో పేరుతో రీమిక్ చేసి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా చిరంజీవి ,  పవన్ కళ్యాణ్ రీమిక్ మూవీ లతో ఈ మధ్య కాలంలో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: