ఎన్టీఆర్ తన 30వ సినిమా ప్రారంభం కాబోతోందని ఎన్టీఆర్ పుట్టినరోజు తెలియజేయగా ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు డైరెక్టర్ కొరటాల శివ. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. అయితే ఈ చిత్రంపై ఎన్టీఆర్ కానీ, కొరటాల శివ కానీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులు కూడా కాస్త విసుగు పోయారని చెప్పవచ్చు. దీంతో సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్గా పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు అభిమానులు.


ఇక విడుదల సంగతి ఎలా అయినా పక్కన పెడితే.. కనీసం షూటింగ్ డేట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలియజేయకపోవడంతో అభిమానులు చాలా నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు హైదరాబాద్ శివారులలో ఒక భారీ సెట్ నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలు వినిపించిన తర్వాత మళ్లీ ఇప్పుడు తాజాగా మరొక సరికొత్త ప్రచారం జరుగుతోంది. ఈనెల 30వ తేదీన ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం అందుకు సంబంధించి చిత్ర బృందం కూడా అధికారికంగా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.



అయితే ఇలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ కావడంతో అభిమానులలో అసలు ఈ సినిమా ఉంటుందా..?ఉండదా..? అనే అనుమానాలకు కూడా దారితీస్తోంది. ఈ కాంబినేషన్ అసలు సెట్ కావడం చాలా కష్టంగా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు హీరో ఇటు డైరెక్టర్ ఇద్దరు కూడా మౌనంగా ఉండడంతో ఈ విషయం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక ఎన్టీఆర్సినిమా కథపరంగా సంతృప్తిగా లేరని అందుకోసమే కొరటాల సేవ ఈ సినిమాని మరింతగా  మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ విషయాన్ని అయినా అధికారికంగా తెలియజేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: