
ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయినప్పటికీ ఈ మూవీ నిర్మాతలు ఈ మూవీ సక్సస్ మీట్ ను నిర్వహించి ఆ మీట్ కు అల్లు అర్జున్ ను అతిధిగా ఆహ్వానించారు. ఇక్కడే ఒక ఆసక్తికర విషయం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సక్సస్ మీట్ కు వచ్చిన అతిధులు అంతా అల్లు శిరీష్ గురించి మాట్లాడకుండా అల్లు అర్జున్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ పొగడ్తలు కురిపించడంతో ఈ మూవీ సక్సస్ మీట్ ను కవర్ చేయడానికి వచ్చిన మీడియా వర్గాలు ఆశ్చర్య పడినట్లు టాక్.
సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లలో సినిమా మంచి చెడ్డల గురించి ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడి అప్పటి వరకు సినిమా చూడని జనాలను థియేటర్ కు రప్పించే విధంగా వక్తల ఉపన్యాసాలు ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా ‘ఊర్వశివో రాక్షసివో’ ఈ మూవీ ఫంక్షన్ లో జరిగింది అని తెలుస్తోంది. సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ నుంచి దిల్ రాజు వరకు అందరూ శిరీష్ గురించి మాట్లాడకుండా అంతా బన్నీ నామస్మరణ చేసారు.
ఆఖరికి అల్లు అరవింద్ కూడ శిరీష్ పై పొగడ్తల వర్షం కంటే బన్నీ పై ఎక్కువ ప్రశంసలు కురిపిమ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కలక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నది చెప్పకుండా బన్నీ నటించిన ‘పుష్ప’ గురించి రాబోతున్న ‘పుష్ప 2’ గురించి ఎక్కువగా మాట్లాడటంతో అవకాశం దొరికితే చాలు ఎవరైనా టాప్ హీరోల భజన చేస్తారు అన్న విషయం మరొకసారి రుజువైంది..