ప్రముఖ పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎదురులేని స్థానంలో పాటల రచయితగా కొనసాగుతున్నాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తరువాత ఈయనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. సాంప్రదాయ సాహిత్యం పై మంచి పట్టు ఉన్న ఈయన కొత్తకొత్త పద ప్రయోగాలతో తన పాటలలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు.


సాధారణంగా కవులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అయితే రామజోగయ్యశాస్త్రి సోషల్ మీడియాలో కూడ చాల యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన సోషల్ మీడియాలో చేసిన కామెంట్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే ఈ రచయిత ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసారు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్లు తన ఫాలోవ‌ర్లుగా ఉండొద్ద‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తూ  ఆయ‌న త‌న పేరు వెనుక పెట్టుకున్న ‘స‌ర‌స్వ‌తి పుత్ర’ అనే టైటిల్ విష‌యంలో వివరణ ఇచ్చాడు ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను అంటూ తనను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే తనతో ప్రయాణించగలరు అని కామెంట్ చేస్తూ తనకు జన్మను యిచ్చిన తన తల్లి గౌరవార్ధం తన పేరును ‘సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి’ గా మార్చుకున్నాను అంటూ ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది అంటూ ప్రశ్నిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈయన బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ మూవీ కోసం వ్రాసిన ‘జై బాలయ్య’ పాటకు సంబంధించి కొందరు చేసిన నెగిటివ్ కామెంట్స్ కు ఇలాంటి ఘాటైన సమాధానం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.


అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని లక్షలు సంపాదించి పెట్టే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని తెలుగు భాష పై మమకారంతో తెలుగు సినిమాల పై అభిమానంతో ఈయన పాటల రచయితగా మారిన విషయం తెలిసిందే. నటన పై కూడ ఈయనకు ఆశక్తి ఉండటంతో అవకాశం చిక్కినప్పుడల్లా అప్పుడప్పుడు సినిమాలలో అతిధి పాత్రలు చేస్తూ తన అభిలాషను చాటుకుంటున్నాడు..మరింత సమాచారం తెలుసుకోండి: