హీరోగా నాని టాలీవుడ్ లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎటువంటి సినీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిర్మాతల హీరోగా నాని మారిపోయాడు. కాగా కొంతకాలంగా నాని నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఈయన వాల్ పోస్టర్ బ్యానర్ అన్న సంస్థను స్టార్ట్ చేసి హిట్ లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సినిమా పేరుకు తగినట్లే హిట్ సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. హిట్ ది ఫస్ట్ కేస్ లో యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాను అనుక్షణం ఎంతో ఆసక్తికరంగా మలిచి డైరెక్టర్ శైలేషు కొలను టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు.

సినిమా టీం సక్సెస్ మీట్ లోనే సీక్వెల్ ను ప్రకటించారు. అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా వెయిట్ చేశారు. కానీ సీక్వెల్ లో హీరోగా విశ్వక్ సేన్ కాకుండా పాన్ ఇండియా హీరో అడవి శేష్ హీరోగా చేయడం విశేషం. "హిట్ - ది కేస్ 2 " పేరు మీద విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ లు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. డైరెక్టర్ శైలేషు కొలను ఈ సినిమాను కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఒకే ఒక్క సీరియల్ హత్యను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ గా అడవి శేష్ మరోసారి అద్భుతంగా చేశాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకు వచ్చి భారీ హైప్ ను తీసుకువచ్చారు. ఇందులో మీనాక్షి చౌదరి , కోమలి ప్రసాద్, రావు రమేష్ , పోసాని కృష్ణమురళి లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంగీతాన్ని ఎం ఎం శ్రీలేఖ మరియు జాన్  స్టీవర్ట్ ఈడూరి లు అందించారు. అడవి శేష్ చేస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అయ్యి అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పదు.       

మరింత సమాచారం తెలుసుకోండి: