హర్ష పులిపాక దర్శకత్వం లో తాజాగా పంచతంత్రం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. బ్రహ్మానందం , స్వాతి రెడ్డి ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు . ఈ మూవీ ని దర్శకుడు హర్ష పులిపాక ఐదు కథల సమూహారంగా నిర్మించాడు . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా పంచతంత్రం మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది . తాజాగా పంచతంత్రం మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటించింది . 

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 7 వ తేదీన నిర్వహించ నున్నట్లు పంచతంత్రం మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది . అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నట్లు అధికారికం గా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది . ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియా లో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పంచతంత్రం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 9 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: