తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నిఖిల్ ఈ సంవత్సరం చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టి  భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నిఖిల్ ఈ సంవత్సరం మరో మూవీ తో ప్రేక్షకులం ముందుకు రానున్నాడు. 

తాజాగా నిఖిల్ "18 పేజీస్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పల్నాటి సూర్య ప్రతాప్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు అనగా డిసెంబర్ 17 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: