నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 2' టాక్ షో కి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్‌ని ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించి మొదటి భాగం ఆహలో స్ట్రిమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ పవన్ ఫ్యాన్స్ ను అలాగే ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కాల్ చేశాడు. ఈ సందర్భంగా తన బాబాయ్‌తో ఉన్న అనుబంధాన్ని రామ్ చరణ్ బాలయ్యతో పంచుకున్నాడు. ఇక బాలయ్య ఫోన్ కాల్ లో మాట్లాడుతూ.." మీ బాబాయి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పు" అని అడగగా.. అందుకు రాంచరణ్ సమాధానం ఇస్తూ .."బాబాయ్ లైఫ్ చాలా బోర్ అండి. కాకపోతే బాబాయికి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. దాన్ని రోజు తినమన్నా కూడా తింటాడు" అని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అని రామ్ చరణ్ స్పష్టం చేశాడు. అంతేకాకుండా తాను చిన్నతనం నుంచి బాబాయి దగ్గరే పెరిగానని..

కళ్యాణ్ బాబాయ్ తో తనకు ఎంతో మంచి బాండింగ్ ఉందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అలాగే ఒకసారి వెకేషన్ కోసం సింగపూర్ కి వెళ్ళినప్పుడు తాను బయట ఫుడ్ తిని వాంతులు చేసుకుంటే బాబాయి స్వయంగా క్లీన్ చేశాడని అప్పటి రోజులను రాంచరణ్ బాలయ్య టాక్ షోలో మరోసారి గుర్తు చేసుకున్నాడు. దాంతో ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈటాక్ షోలో పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి క్లారిటీ ఇవ్వడంతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇక ప్రస్తుతం మొదటి భాగం ఎపిసోడ్  ఎంతో సరదాగా సాగడంతో పార్ట్ 2 కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ఎండ్ కార్డ్  పడనుంది.ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్,OG అనే అనే వర్కింగ్ టైటిల్ తో సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: