బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందారు హీరో ప్రభాస్. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికీ పలు భారీ చేపట్టిన ప్రభాస్ వాటితో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా టీజర్ ద్వారా పలు రకాలుగా ట్రోలింగ్  ఎదుర్కోవడం జరిగింది. గతంలో ఎన్నడి లేనివిధంగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించిన లుక్ ఆకట్టుకోలేకపోవడంతో ఆయన పైన విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా మొదలయ్యాయి.
ఇప్పటికే ప్రభాస్ లుక్స్ పైన ఎన్నో రకాలుగా కామెంట్లు వినిపించాయి. ఇటీవల ప్రభాస్ కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియా లో చాలా వైరల్ గా మారుతున్నది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లెజెండ్ రజనీకాంత్ శివరాజ్ కుమార్ తో ఫోజులిస్తుండడం సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారుతోంది .అయితే ఈ ఫోటో ఖచ్చితంగా మార్ఫింగ్ చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇతను ప్రభాస్ కాదు ఇది ఫేక్ పిక్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ ఎక్కువగా మద్యం తాగారా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


బాహుబలి, సాహో, రాధే శ్యామ్ వంటి చిత్రాలలో కూడా ప్రభాస్ కనిపించారు సాహో సినిమా పరవాలేదు అనిపించుకున్న రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా పాటలపరంగా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్-k, స్పిరిట్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఈ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించి ట్రోలింగ్ ఫోటో ఒకటి వైరల్ గా మారుతుంది దీనివల్ల ప్రభాస్ అవుతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: