తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో బొమ్మరిల్లు భాస్కర్ ఒకరు. ఈయన సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన బొమ్మరిల్లు మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టాడు  ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో భాస్కర్ కు అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ క్రేజీ దర్శకుడు అల్లు అర్జున్ హీరోగా పరుగు అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జెనీలియా హీరోయిన్ గా ఆరెంజ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని కొణిదల నాగబాబు నిర్మించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. కానీ ఈ మూవీ కి ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను థియేటర్ లలో 4 కే వర్షన్ తో మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు.

మూవీ ని భాస్కర్ ఈ రోజు హైదరాబాద్ లోని దేవి 70 ఎం ఎం థియేటర్‌ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ దర్శకుడు ఒక సముద్రాన్ని చూశాను అని పేర్కొన్నాడు. అపరిమితమైన ప్రేమకు అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్ లు ఈ సినిమాకు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: