మంచి వసూళ్ళని రాబడుతున్న మహావీరుడు ?
మహావీరుడు : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ నటించిన మహావీరుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మడోన్నే అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అదితి శంకర్ హీరోయిన్‌గా, సీనియర్ నటి సరిత, దర్శకుడు మిస్కిన్, తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు.ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకాల్లో అవినీతి, అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా వినోదాత్మకంగా తెరకెక్కింది. జూలై 14వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మావీరన్ (మహావీరుడు) సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 85 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక తమిళనాడులో 600 స్క్రీన్లకుపైగా కేరళలో 200 స్క్రీన్లలో, ఏపీ ఇంకా తెలంగాణలో 200 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.శివ కార్తీకేయన్‌కు తెలుగులో కూడా భారీ క్రేజ్ వున్న కారణంగా మహావీరుడు సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి.ఇక తమిళనాడులో 2023 సంవత్సరంలో ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 5 చిత్రంగా తెరకెక్కింది. అక్కడ భారీ కలెక్షన్లు, ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఈ సినిమా సాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి మొత్తం 120 కోట్ల బిజినెస్ చేసింది.మహావీరుడు సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే తొలి రోజు ఈ సినిమా తమిళనాడులో 10 కోట్ల కలెక్షన్లు ఆంధ్రాలో 2 కోట్ల గ్రాస్ వసూళ్లు, కేరళలో 1 కోటి రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 2 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది.ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి దాదాపు 20 కోట్లపైగా వసూళ్లు చేసినట్టు సమాచారం తెలుస్తుంది.ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో చూడాలి.