టాలీవుడ్ యువ నటుడు నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇక మాచర్ల నియోజకవర్గం మూవీ తర్వాత నితిన్ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. 

మూవీ లో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రావు రమేష్మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. హరిజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను ... పాటలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ బృందం మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు.

మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 4 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఎన్ కన్వెన్షన్ ... మాదాపూర్ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ నుండి ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా కట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: