తమిళ హాట్ నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో కూడా ఓ వెలుగు వెలిగింది.'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది ఈ తమిళ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ కొన్నాళ్లపాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇక 40 ఏళ్ల ఏజ్‌లో కూడా అందంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ త్రిష వావ్ అనిపిస్తోంది. ఇంకా అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగింది.త్రిష ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చింది. ఇక  ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించగా..కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా హిందీ తెలుగు సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది. విడుదలైన ఫస్ట్ రోజే వంద కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమా కొంతమందికి సినిమా మరీ బోల్డ్ గా కనిపించినప్పటికీ.. మరికొంత మందికి సందీప్ డైరెక్షన్ తెగ నచ్చేసింది. ఈ సినిమా చూసి స్టార్ హీరోయిన్ త్రిష అద్దిరిపోయే రివ్యూ ఇచ్చింది. యానిమల్ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ వన్ డైలాగ్  "కల్ట్" అంటూ సినిమాకి సంబంధించిన బోల్డ్ సీన్స్ పై ఈమోజీ పిక్చర్స్ తో షేర్ చేసింది.అంతే త్రిషని నెటిజన్లు ట్రోల్ చేస్తూ బండ బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు.


నిన్న కాక మొన్ననేగా మన్సూర్ అలీ ఖాన్ ఇలా మాట్లాడాడు.. అలా మాట్లాడాడు అంటూ తెగ మండిపడ్డావు. మరి సినిమాలో ఇంత బూతు కంటెంట్ ఉంటే నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావంటూ ఓ రేంజ్ లో ఆమెపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. దాంతో దెబ్బకు దారిలోకి వచ్చిన త్రిషపోస్టర్ ని వెంటనే డిలీట్ చేసేసింది. అయినా సరే స్క్రీన్ షాట్ తీసి జనాలు ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై స్పందించడానికి స్టార్స్ భయపడుతున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ముఖ్య అతిధులు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కూడా ఈ సినిమాపై స్పందించట్లేదు.ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే నెగటివిటీ, రివ్యూస్ తో పనిలేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో కుమ్మేస్తుంది. ఇప్పటికే 400 కోట్లపైగా వసూలు చేసిన ఈ సినిమా 500 కోట్ల వైపు దూసుకువెళుతూ నిర్మాతలకు భారీ లాభాలు తెస్తుంది. నార్త్ అమెరికాలో 7 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఇండియాలో 400 కోట్ల సినిమాలు సాధించిన హీరోల విషయానికి వస్తే అమీర్ ఖాన్ 4, సల్మాన్ ఖాన్ 4, షారుఖ్ ఖాన్ 3, ప్రభాస్ 3, రణబీర్ కపూర్ 3, సూపర్ స్టార్ రజినీకాంత్ 2 కలిగి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: