ఇటీవల కాలంలో ప్రేక్షకుల పంథా మారిపోయింది. ఇక మంచి కథ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు తప్ప కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ తో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన  సినిమాలను కథ కథనం బాగాలేదు అన్న కారణంతో పక్కన పెట్టేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. దీంతో ఏ సినిమా హిట్ అవుతుంది. ఏ సినిమా ఫట్ అవుతుంది అన్నది కూడా దర్శక నిర్మాతలు ముందుగా ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సినిమా హిట్ అవడం విషయంలో కథ ఎంత ముఖ్యమో ఆ సినిమాకు పెట్టిన టైటిల్ కూడా అంతే ముఖ్యం.సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే విధంగా ఇక అందరిలోకి దూసుకుపోయే విధంగా టైటిల్ ఉండాలి. అందుకే టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో కాస్త వినూత్నంగా ఆలోచిస్తూ విచిత్రమైన టైటిల్స్ కూడా సినిమాలకు పెడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇప్పుడు వెంకటేష్ సినిమాకి కూడా ఇలాంటి ఒక టైటిల్ పెట్టారు అన్నది తెలుస్తుంది. ఈ సంక్రాంతికి సైందవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ పోటీలో పెద్దగా సత్తా చాట లేకపోయినా.. ఒక మోస్తారు విజయాన్ని మాత్రం అందుకున్నాడు. ఇక ఎప్పుడూ మరో సంక్రాంతిపై దృష్టి పెట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ సినిమా చేస్తున్నాడు.


 ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉందట. అయితే ఈ మూవీకి డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో నిలిచే ప్రతి సినిమా మేకర్స్ కూడా సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెబుతూ ఉంటారు. ఇలా అందరూ చెప్పే మాటనే అనిల్ రావిపూడి ఏకంగా తన సినిమాకి టైటిల్ గా పెట్టేసాడు. ఏమైనా అనిల్ రావిపూడి సినిమా కథ విషయంలోనే కాదు టైటిల్ విషయంలోనూ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. అందుకే కదా అందరు డైరెక్టర్లలో కెల్లా అతను ప్రత్యేకమైన స్థానంలో నిలిచాడు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: