ప్రణవి మణికొండ.. పరిచయం అవసరంలేని పేరు. నటిగా బుల్లితెరపై సందడి చేసి పలు సినిమాలలో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా మోడలింగ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. మనకి ప్రణవి సీరియల్ హీరోయిన్ గానే తెలిసినప్పటికీ ఈమె అనేక సినిమాల్లో మెయిన్ రోల్స్ చేసింది. ఈ ముద్దుగుమ్మ ఫిబ్రవరి 19.. 2003 లో జన్మించింది. తండ్రి పేరు శ్రీనివాస్ మూర్తి. ఈయనకి ఒక మొబైల్ షాప్ వ్యాపారం ఉంది.ఇక తల్లి పేరు రక్త వల్లి. ఈమె హౌస్ వైఫ్. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఒక అక్క కూడా ఉంది. తన పేరు నవీన్ తేజ. ఇక ఈ ముద్దుగుమ్మ కి చిన్నప్పటి నుంచే మోడలింగ్ మరియు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో తన ఫ్యామిలీని ఒప్పించి ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. తొలుత మోడలింగ్లో తన సత్తా చాటుకుని అనంతరం అనేక సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక అలా సీరియల్స్ కే పరిమితం కాకుండా వెండితెరపై కూడా తన యాక్టింగ్ నిరూపించుకుంది.
ఇక ఈమె స్టడీస్ మొత్తం హైదరాబాద్ లోనే పూర్తయ్యాయి. ఈమెకి ఎనిమిదేళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక అవకాశాలు వచ్చాయి. దీంతో తన చిన్న వయసులోనే అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఉయ్యాల జంపాల, బ్రహ్మోత్సవం, సర్కార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో నటించి మెప్పించింది. అదేవిధంగా చిన్నప్పుడు ఈమె నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో ఈమె పాత్రకు గాను నంది అవార్డు సైతం దక్కింది.
అదేవిధంగా తెలుగులో ప్రసారమైన పసుపు కుంకుమ, గంగ మంగ, సూర్యవంశం, ఎవరే నువ్వు మోహిని వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఒకపక్క చదువును కొనసాగిస్తూనే మరోపక్క నటనను నేర్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. తాజాగా గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల ధరించిన వేషధారణలో ప్రణవి దర్శనమిచ్చింది. దీంతో శ్రీ లీలాకే పోటీ ఇస్తున్నావా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: