డిజె టిల్లు మూవీ తో ఓవర్ నైట్ లో సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ సిద్దు కు జోడిగా నటించగా ... మల్లిక్ రామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. 

ఇకపోతే ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ ట్రైలర్ నీ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ట్రైలర్ విడుదల చేసి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ మూవీ యొక్క రిలీజ్ ట్రైలర్ ను రేపు విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో సిద్దు , అనుపమ లిప్ లాక్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో సిద్దు , అనుపమ జంట చాలా హాట్ గా ఉండడంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయినటువంటి డిజె టిల్లు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: