ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 టాప్ ప్రొడ్యూసర్స్ అంటే ఖచ్చితంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సినిమాల లైనప్ చూస్తే ఖచ్చితంగా నోరెళ్లబెట్టడం ఖాయం.ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితో కూడా వీళ్ళు నీళ్లు తాగినంత ఈజీగా సినిమాలు చేస్తున్నారు. ఒక్క కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ మార్కెట్ లో కూడా భారీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. కెరీర్ ప్రారంభంలోనే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థ.. ఆ తరువాత రంగస్థలం, పుష్పతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఎవరికి లేనన్నీ స్టార్ హీరోల సినిమాలు ఈ నిర్మాణ సంస్థలో ఉన్నాయంటే మామూలు విషయం కాదు.


వీరి లైన్ అప్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక రెండవది అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఏ రేంజ్ అంచనాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా రూ.1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని సమాచారం తెలుస్తుంది. రామ్ చరణ్ తో ఇప్పటికే రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థ..ఆయనతో మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. వాటిలో ఇటీవలే మొదలైన పాన్ ఇండియా సినిమా RC16, సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC17 సినిమాలు కూడా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ రెండు సినిమాలపై కూడా అభిమానుల్లో భారీ అంచాలున్నాయి. అలాగే  ప్రభాస్, సితారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో కూడా ఒక సినిమా చేయనుంది మైత్రి సంస్థ. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో రెండవ ప్రపంచయుద్ధం బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మృణాల్ టాకూర్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వైరల్ అవుతున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.అలాగే తమిళ టాప్ హీరో అజిత్ తో కూడా ఈ సంస్థ సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: