టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన సినిమా ప్రసన్న వదనం. ఈమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా చేసిన అర్జున్ వై కే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జెఎస్ మణికంఠ టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. అలాగే పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మే 3న గ్రాండ్గా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

 అంతేకాదు సినిమాలోని ట్విస్ట్ లు త్రిల్లింగ్ ఎలిమెంట్స్ అస్సలు ఊహించలేము అన్న కామెంట్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది అంటూ టాక్ కూడా వినబడింది. మొట్టమొదటిసారిగా ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకుంటుంది అని మొదట ఎవరు అనుకోలేదు. అయితే థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు బ్రేక్ ఈవెన్ టార్గెట్

 అందుకొని ప్రాఫిట్ కూడా బాగానే తెచ్చుకుంది. ఇకపోతే సినిమా విడుదల ముందు కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను సరికొత్తగా వెరైటీ స్టైల్ లో చేశారు చిత్ర బృందం. మొదటి నుండే సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. కాగా ఇప్పుడు ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రసన్నవదనం సినిమా ఓటిటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా 24 నుండి ఆహాలు స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు.  సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్స్ లో విడుదలైన తర్వాత 30 రోజులకి ఓటీటీ లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం దానికంటే ముందే వచ్చేస్తున్నాయి. మరి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఓటీ టీ లో ఎటువంటి రెస్పాన్స్ కనబరుస్తుందో చూడాలి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: