కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో భారీ కాస్టింగ్ ఆడ్ అయింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన స్టార్ నటీనటులను రంగంలోకి దింపారు. సూపర్ స్టార్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ వంటి భారీ

 గుర్తింపు ఉన్న స్టార్ హీరోలు అందరూ ఈ సినిమాలో కనిపించడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో మరొక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కూడా రంగంలోకి దింపినట్లుగా సమాచారం వినబడుతోంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరాయి. అయితే గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మోసగాళ్లు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో విష్ణు కి సిస్టర్ పాత్రలో కనిపించింది కాజల్. కానీ ఇప్పుడు కన్నప్ప సినిమాలో మాత్రం

 కాజల్ ఏ పాత్రలో కనిపించబోతుంది అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు అక్షయ్ కుమార్ శరత్ కుమార్ బ్రహ్మానందం కనిపించబోతున్నారు. వారితోపాటు ఇప్పుడు కాజల్ కూడా ఇందులో జాయిన్ అయింది. మరి ఇంతమంది స్టార్ కాస్ట్ నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. మరి కాస్టింగ్ పెరిగే కొద్దీ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దాంతోపాటు బడ్జెట్ కూడా పెరిగిపోతుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కాజల్ ఇప్పుడు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం జోరు చూపిస్తోంది కాజల్. మరి కన్నప్పతో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: