కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ సినిమా మహారాజా. లాంగ్ గ్యాప్ తర్వాత ఎటువంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేశారు. రెండు భాషల్లోనూ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే మహారాజ సినిమాకి సంబంధించిన సక్సెస్ ప్రమోషన్స్లో భాగంగా పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్న విజయ్ సేతుపతి తనకి సంబంధించిన చాలా

 విషయాలను పంచుకుంటున్నారు. అలాగే తన ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ సినిమా ఏది అన్న అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా మహారాజా చిత్ర బృందాన్ని టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగానే బుచ్చిబాబు తను నెక్స్ట్ చేయబోయే సినిమా పై  షాకింగ్ కామెంట్స్ చేసారు విజయ్ సేతుపతి. ఇకపోతే గతంలో బుచ్చిబాబు చేసిన ఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడు విజయ్ సేతుపతి. ఇక ఆ చనువుతో బుచ్చి బాబు నెక్స్ట్ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ లీక్ చేశాడు. ఇంటర్వ్యూ చివర్లో బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన #RC16 మంచి విజయం సాధించాలని విజయ్ సేతుపతి కోరారు. “బుచ్చి..

 నువ్వు తీయబోతున్న రామ్ చరణ్ కు ఆల్ ది బెస్ట్. నీకు తెలుసు కదా.. #RC16 స్టోరీ నాకు చెప్పావు. ఆ విషయం చెప్పొచ్చు కదా.. నాకు ఆ స్టోరీ తెలుసు. అది చాలా సూపర్ కథ. ఆ ధీమాతోనే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆ సూపర్ డూపర్ హిట్ కావడం పక్కా. ఆ స్టోరీ నువ్వు రాసిన విధానం అద్భుతం” అంటూ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. దీంతో #RC16 అంచనాలు పెరిగాయి. విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఉప్పెన తోనే దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: