
అంతేకాకుండా ఇటీవలే హీరోయిన్ విన్సీ కూడా ఒక వీడియోలో ఒక నటుడు డ్రగ్స్ తీసుకొని మరి సినిమా షూటింగ్లో పాల్గొన్నారంటు తెలియజేయడమే కాకుండా ఈ విషయం అక్కడ షూటింగ్లో పాల్గొన్న వారందరికీ తెలుసని తెలిపింది. అంతేకాకుండా తనతో అసభ్యకరంగా కూడా ప్రవర్తించారంటూ తెలియజేసింది. దీంతో ఆ నటుడు షైన్ టామ్ చాకో అని తేలిపోయింది.అయితే తాజాగా ఇటీవలే కొన్ని హోటల్స్ లో డ్రగ్స్ రైడ్ నిర్వహించిన సమయంలో నటుడు షైన్ టామ్ చాకో పోలీసుల నుంచి పారిపోయాడని విషయాలు వినిపిస్తున్నాయి.అది కూడా మూడవ అంతస్తు నుంచి దుంకి స్విమ్మింగ్ పూల్ లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినట్లు మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
విన్సీ షైన్ టామ్ చాకో డ్రగ్స్ సేవించి మరి సెట్లో తనని ఇబ్బంది పెట్టారని ఫిర్యాదు చేయడంతో..AMMA కమిటీ విచారణ కూడా చేయడం జరిగిందట.అయితే 2015లో ఈ విచారణ జరగగా అందులో షైన్ టామ్ చాకో నిర్దోషిగా బయటపడ్డారు. మొత్తానికి ఇప్పుడు మరొకసారి ఇలా వైరల్ గా మారుతున్నది. సూత్ర వాక్యం అనే సినిమా షూటింగ్ సెట్లు షూటింగ్ జరుగుతున్నట్టు సమయంలో షైన్ టామ్ చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ విన్సీ తెలియజేసింది. మరి రాబోయే రోజుల్లో ఈ నటుడు పైన మరిన్ని చర్యలు తీసుకుంటారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన షైన్ టామ్ చాకో ఎలా స్పందిస్తారో చూడాలి.