"అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి".. ఈ మూవీ గురించి ఇప్పుడు జనాలు ఎంత పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారో అందరికీ తెలిసిందే . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయ్యింది . మరి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ పర్ఫామెన్స్ - విజయశాంతి పర్ఫామెన్స్ కు వేరే లెవెల్ మార్కులు పడుతున్నాయి . ఈ సినిమా కాన్సెప్ట్ చిన్నదే . కానీ వీళ్ళు నటించిన విధానం మాత్రం అందరికీ బాగా నచ్చేసింది . ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు .


కాగా ఈ సినిమాలో విజయ శాంతి క్యారెక్టర్ లో ముందుగా అనుకున్న హీరోయిన్ డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . నిజానికి ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ లో ముందుగా హీరోయిన్ రమ్యకృష్ణను అనుకున్నారట.  కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఆమె ఈ మధ్యకాలంలో సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . బిగ్ సినిమా అయితే ..లేకపోతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే కాన్సెప్ట్ మాత్రమే ఓకే చేస్తుంది. ఆ కారణంగానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సినిమాని రిజెక్ట్ చేసిందట. డైరెక్టర్ , అలాగే కళ్యాణ్ రామ్ చాలా చాలా ఎక్కువుగా ఆమెను ఈ రోల్ లో చూపించడానికి ట్రై చేశారట. కానీ ఆమె ఒప్పుకోలేదు.



ఆ తర్వాత నదియాని కూడా ఈ పాత్రలో నటించమంటూ అడిగారట. ఆమె కూడా ఇంట్రెస్ట్  చూపించకపోయేసరికి ఫైనల్లీ విజయశాంతిని అప్రోచ్ అయ్యారట. ఏమాటకు ఆ మాటే విజయశాంతి ఈ పాత్రను ఒప్పుకుని మంచి పని చేసింది.  నిజానికి ఈ పాత్రలో ఆమె తప్పిస్తే వేరే ఎవరు సూట్ కారు . అంతలా జీవించేసింది . రాములమ్మ ఇస్ బ్యాక్ అని అనిపించుకుంది. సోషల్ మీడియా లో విజయ శాంతి నటనను జనాలు ఎలా పొగిడేస్తున్నారు చూస్తూనే ఉన్నాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: