సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది సినిమాల్లోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఈ చిన్నది తన నటన, అందంతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగించింది. ఆ సినిమాలో నటుడు నాగచైతన్య సరసన హీరోయిన్ గా చేసి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన ఈ బ్యూటీ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ చేసుకుంది.

 అనంతరం సమంత, నాగచైతన్య ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఇక వారి వైవాహిక జీవితం ఎంతో కాలం కొనసాగలేదు. కేవలం నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న సమంత చైతు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సమంత, చైతు వారి పర్సనల్ లైఫ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య మరో వివాహం చేసుకొని హ్యాపీ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. కాగా, సమంత ఇప్పటివరకు సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సమంత వివాహం చేసుకోబోతుందని ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ సమంత ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ సమంత రాజ్ నిడుమోరుతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సమంత, రాజ్ నిన్న తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్నారు. 

దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై మరింత బలం చేకూరింది. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత రాజ్ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం అందుతుంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ రాజ్ కానీ, సమంత కానీ స్పందించలేదు. కాగా సమంత, నాగ చైతన్య మీద రివేంజ్ తో ఓ ప్లాన్ చేసిందట. సమంత చైతన్య అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. ఇక సమంత రెండో పెళ్లిని అక్టోబర్ నెలలోనే వారు విడాకులు తీసుకున్న రోజునే చేసుకోవాలని అనుకుంటుందట. నాగచైతన్య మీద రివేంజ్ తోనే సమంత ఈ ప్లాన్ చేసిందని అనేక రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: