తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో కోలీవుడ్ మూవీలలో హీరో గా నటించి తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు తాను నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాడు. అందులో చాలా మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

కొంత కాలం క్రితం సూర్య కంగువా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరో గా నటించాడు. పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించింది. మే 1 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మే 1 వ తేదీనే తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు తెలుగు లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఏప్రిల్ 26 వ తేదీన JRC కన్వెన్షన్ ,  హైదరాబాదులో , సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుత ఆ పోస్టర్ సోషల్ మీడియా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: