నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాల ను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకం టూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నాని గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మరికొన్ని రోజుల్లోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ,  అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే హిట్ 3 మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి ని ముఖ్య అతిథిగా తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయినట్లయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం హిట్ 3 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ కి సంబంధించిన పనులు పూర్తి కాగానే నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: