
ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీయగా అది కూడా మంచి విజయాన్ని సాధించింది. దాదాపు ఈ సినిమా 1800 కోట్ల కలెక్షన్లను రాబట్టి అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. ఇక ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ దర్శకుడు అట్లితో కలిసి ఏఏ22 సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను ఎంపిక చేయాలని అనుకుంటున్నట్టుగా ఓ వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో స్పెషల్ సాంగ్ కోసం సమంతను అనుకుంటున్నారట. ఈ విషయాన్ని సమంతకు చెప్పగా ఆమె సున్నితంగా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. అయినప్పటికీ వినకుండా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని సమంతను తెగ ఇబ్బంది పెడుతున్నారట. మరి సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తుందా లేదా అనే సందేహంలో తన అభిమానులు ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.