
ఇప్పుడు ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు కొందరు అక్కినేని హేటర్స్. ఈ మధ్యకాలంలో శోభిత ధూళిపాళ్లకు సంబంధించిన రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమంతకు విడాకులు ఇచ్చేసి నాగచైతన్య మంచి పని చేశాడు అని శోభిత ధూళిపాళ్ళ రావడం వల్ల ఆయనకు మంచి మంచి హిట్స్ తన ఖాతాలో పడుతున్నాయ్ అని అంటూ శోభిత అక్కినేని పేరుని ఇంకా హైలైట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. బడా బడా సినిమాలలో శోభిత ధూళిపాళ్లకు అవకాశాలు ఇవ్వాలి అంటూ కొంతమంది డైరెక్టర్ లు బాగా ట్రై చేస్తూ ఉండగా స్టార్ హీరో లు మాత్రం ఆమె వద్దనే వద్దు అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర కోసం శోభిత ధూళిపాళ్లని అనుకున్నారట మేకర్స్. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆమె వద్దనే వద్దు అంటూ రిజెక్ట్ చేశారట. కేవలం జూనియర్ ఎన్టీఆర్ కాదు ప్రభాస్ - రామ్ చరణ్ - బన్నీలు కూడా శోభిత ధూళిపాళ్ళ తమ సినిమాలో వద్దు అంటూ తెగేసి చెప్పేసారట . స్టార్ హీరో భార్య అయిన కారణంగానే ఇలా రిజెక్ట్ చేశారు అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే .. మరి కొంత మంది మాత్రం అసలు ఆమెది హీరోయిన్ మెటీరియలే కాదు అని అలాంటి బ్యూటీ ని సినిమాలో ఎలా పెట్టుకుంటాం అన్న ఉద్దేశం కారణంగానే ఈ హీరోస్ రిజెక్ట్ చేశారు అని ఘాటుగా మాట్లాడుకుంటున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ స్టార్ హీరోలు శోభిత ధూళిపాళ్లను సినిమాలో పెట్టుకోకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు అంటూ అక్కినేని హేటర్స్ ఓ రేంజ్ లో ఈ వార్తను బాగా వైరల్ చేస్తున్నారు . దీంతో అక్కినేని ఇంటికి కోడలు పరువు పోయినట్టు అయ్యింది...!