
"దెబ్బలు పడతయిరో రాజా" అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతుంది మరొక స్టార్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు ఇదే న్యూస్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. తన కెరియర్ లో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . అది కూడా ఒక బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ సినిమాలో ..
ఆయన మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ . తారక్ రేంజ్ గురించి క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అలాంటి హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఖచ్చితంగా.. లక్ ఉండాలి. అందుకే ఆ అవకాశం వచ్చిన రష్మిక అస్సలు మిస్ చేసుకోలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది . ప్రశాంత్ నీల్ -ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయబోతుందట రష్మిక. ఈ సాంగ్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. అందుకే అంతకన్నా ప్రత్యేకమైన హీరోయిన్ రష్మిక మందన్నాని చూస్ చేసుకున్నారట. ఎప్పటినుంచో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటూ వెయిట్ చేస్తుంది రష్మిక. ఆ కారణంగానే అడిగి అడగగానే ఓకే చేసిందట..!