ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు పెద్ద సినిమాల మధ్య పోటీని హీరోల పరంగానే కాకుండా దర్శకుల కోణం నుంచి కూడా చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి .. ఆ వెంటి అనేది ఇక్కడ చూద్దాం హిట్‌3 కి బజ్‌ ఎందుకు ఎక్కువ ఉందనేది అర్థమవుతుంది రెట్రో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు ఇంటిలిజెంట్ ఫిలిం మేకర్ గా పేరు ఉంది .. అలాగే క్లిష్టంగా అనిపించే స్టోరీలతో ఒక్కసారి అర్థం కాని కథ‌లతో తెరకెక్కించి ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతూ ఉంటారు ..  జగమే తంతిరం , మెర్క్యూరీ  వంటివి మంచి ఉదాహరణలు .. మహాన్ ఓటీటీలో వచ్చింది కాబట్టి దాన్ని థియేటర్ పొటెన్షిలిటీ అంచనా వేలం కానీ అది గొప్ప క్లాసిక్ ఏం కాదు ..
 

కానీ మిగిలిన వాటిలో రజనీకాంత్ స్టైల్ అండ్ ఇమేజ్  వల్ల పేట గట్టెక్కగా నవరసా వెబ్ సిరీస్ లో తీసిన సింగిల్ ఎపిసోడ్ కు సైతం ఏమంత గొప్ప ప్రశంసలు కూడా రాలేదు .. కార్తీక్ సుబ్బరాజ్ 13 సంవత్సరాల కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే ఒక‌టి జిగర్ తండా, రెండు ఇరైవి .. కోలీవుడ్ లో మాత్రమే బాగా ఆడాయి .. ఇక గత చిత్రం జిగ‌ర్ తండా డబుల్ ఎక్స్ తెలుగులో సహా అన్ని భాషల్లో డిజాస్టర్ .. కోలీవుడ్ లో మాత్రమే భారీ కలెక్షన్లు అందుకుంది ..  అయితే దీనిబట్టి రిట్రోకు ఎక్కువ పని చేస్తుంది సూర్య ఇమేజ్ మ‌త్ర‌మే ...  లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, ప్రశాంత్ నీల్ గా కార్తీక్ సుబ్బరాజ్‌కు కమర్షియల్ పరంగా ఇమేజ్ లేదనేది వాస్తవం .



అలాగే దర్శకుడు సైలాష్ కొలను విషయానికి వస్తే తీసింది మూడు సినిమాలే వాటిలో సైంధవ్‌ ఒకటే ఫ్లాప్ .. హిట్ ది ఫస్ట్ కేస్ హిట్ ది సెకండ్ కేస్ హిట్ అయ్యాయి కలెక్షన్లు పరంగా నిర్మాత నానికి బాగా లాభాలు తెచ్చిపెట్టాయి .. ఇక ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ ని శైలాష్ కొలను తెరకెక్కించిన విధానం అంచనాలను పెంచేసింది. ట్రైలర్ కట్ కొంచెం అర్థం కాని విధంగా అనిపించిన నాని కటౌట్ సహాయంతో శైలేష్ స్టైలిష్ యాక్షన్ తో అంచనాలు పెంచేశాడు .. కోలీవుడ్ హిందీలోనూ బుకింగ్ కూడా మంచిగా ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం .. ఇందులో ఎలా చూసినా కార్తీక్ సుబ్బరాజ్ సీనియర్ ఇంటిలిజెంట్ ని .. కేవలం ఐదేళ్ల అనుభవం ఉన్న శైలాష్ వైలెంట్ గట్టిగా డామినేట్ చేస్తుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు .. ఇక మరి ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌ తెచ్చుకుంటుంది అనేది చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: