ఇప్పుడు నాని పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుంది అన్న విషయం అందరికీ బాగా తెలిసిందే . ఆఫ్ కోర్స్ అంతకు ముందు కూడా నాని పేరు ఎక్కువగా వినిపించేది . కానీ ఇప్పుడు మాత్రం నాని పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఆయన నటించిన హిట్ 3 సినిమా.  రీసెంట్ గానే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.  కచ్చితంగా 100 కోట్లు కలెక్ట్ చేసేస్తుంది ఈ సినిమా అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే హిట్ 3 సినిమా ఇప్పుడు నానికి మరో బిగ్  ఛాన్స్ తెచ్చి పెట్టినట్లు అయ్యింది.


 నాని సినిమాలు చూస్ చేసుకునే  విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా స్టెప్ తీసుకుంటున్నాడు.  అల్లాటప్ప సినిమాలు అన్ని చూస్ చేసుకోవడం లేదు. తనలోని డిఫరెంట్ యాంగిల్ ని బయట పెట్టే సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు. కాగా హీరో నాని హిట్ 3 సినిమా చూసిన ఒక బిగ్ బడా బాలీవుడ్ డిరెక్టర్ స్వయంగా నానికి కాల్ చేసి విష్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు స్పెషల్గా ఆయన ముంబైకి వచ్చి మీట్ అయ్యేలా కూడా మాట్లాడారట. త్వరలోనే నాని ముంబైకి వెళ్లి ఆ డైరెక్టర్ ను పర్సనల్గా కలవబోతున్నారట.



అంతే కాదు వీళ్ కాంబోలో సినిమా ఉండొచ్చు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . నాని శ్యామ్ సింగరాయ్ హిట్ సినిమా పడిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి . కానీ అది ఎందుకో సెట్ కాలేదు . సినిమా చూసిన తర్వాత నానికి కచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి అని అంత అనుకున్నారు . అనుకున్నట్టే జరిగింది.  స్వయానా స్టార్ డైరెక్టర్ కి కాల్ చేసి ముంబై కి వెళ్ల మీట్ అయ్యే  ఛాన్స్ దక్కించుకున్న్ నాని..త్వరలోనే  అంటూ మాట్లాడుకుంటున్నారు నాని అభిమానులు. మొత్తానికి హిట్ 3 సినిమా నానిని మరిన్ని హిట్ సినిమ ఛాన్సెస్ తెచ్చిపెడుతుంది . చూద్దాం నాని కెరియర్ ఎలా ముందుకు వెళుతుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: