
ఆ హీరోయిన్ ఎవరో కాదు మాళవిక మోహన్.. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తోంది. తన నటనకు గాను ఎన్నో అవార్డులు అందుకున్న మాళవిక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో మాయ చేస్తూ ఉంటుంది.
మాళవిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నెటిజన్ అడిగిన ఒక ప్రశ్నకు ఊహించని సమాధానం తెలియజేస్తూ.. మీరు వర్జినా అనే ప్రశ్న వేయగా.. అందుకు మాళవిక.. ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతారు ఇలాంటివి అడగడం మానేయండి అంటూ ఒక కౌంటర్ సైతం వేసింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ ట్విట్ అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మాళవిక మోహన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా అన్ని భాషలలో కూడా హవా చూపించడానికి ఒక్కొక్క అడుగు వేస్తోంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో తన అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ.