మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అంతేకాకుండా చిరంజీవి నటించిన సినిమాలలోని కొన్ని పాటలు ఇప్పటికీ సెన్సేషనల్ హిట్ సాంగ్స్. అందులో "అబ్బనీ తీయని దెబ్బ" సాంగ్ ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 

వైజయంతి మూవీస్ బ్యానర్ పై 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో ఈనెల 9వ తేదీన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను రీ రిలీజ్ చేయాలని చిత్ర వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా హీరో చిరంజీవి మాట్లాడుతూ అబ్బనీ తీయని దెబ్బ పాట గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ రోజుకు కూడా ఈ పాట ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తుందని చెప్పాడు. అబ్బనీ తీయని దెబ్బ పాట చాలా బాగుందని ఆయన వెల్లడించారు.

ఈ పాట కేవలం ఒకే ఒక్క రోజులో రికార్డింగ్ అయిందంటే చాలామంది ఆశ్చర్యపోతారని ఎవరు నమ్మరని చిరంజీవి పేర్కొన్నారు. ఒక్కరోజు కూడా కాదు ఉదయం తొమ్మిది గంటలకు ఇళయరాజా గారు రికార్డింగ్ హాలు వద్ద ఉండి 11-12 గంటల మధ్య తాము పక్క సెట్ లో షూటింగ్ చేస్తుండగా ఆ పాట బాగుందా వినండి అని ఒక చిన్న ట్యూన్ పంపించారని ఆ పాట వినగానే రాఘవేంద్రరావు గారికి, దత్తు గారికి, తనకు పాట ఎంతగానో నచ్చిందని హీరో చిరంజీవి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికీ కూడా ఎంతోమంది అభిమానులకు చాలా ఇష్టమని చెప్పవచ్చు. అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ నేటికీ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ లో ఒకటని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: