ప్రభాస్ తన సినిమాల విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. హీరోయిన్స్ ని రిపీట్ చేయరు.. ఆయన హీరోయిన్ ని రిపీట్ చేశారు అంటే మాత్రం అది చాలా చాలా స్పెషల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు.. రెబెల్ అభిమానులు . మరీ ముఖ్యంగా ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలల్లో నటించాడు . ఆయన ఎక్కువగా రిపీట్ చేసిన హీరోయిన్స్ ఫింగర్స్ కౌంటింగ్ చేయొచ్చు . హీరోయిన్ త్రిష ..హీరోయిన్ కాజల్ ..హీరోయిన్ అనుష్క ఇలా టాప్ మోస్ట్ బ్యూటీసే ఉంటారు .


ఇప్పుడు ఆ లిస్టులోకి దిశ పటాని కూడా చేరిపోయింది . అయితే తాజాగా ఆ లిస్ట్ లోకి మరొక హీరోయిన్ కూడా చేరిపోయింది.  ఆమె మరి ఎవరో కాదు గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే.  రీసెంట్ గానే తల్లి అయ్యింది. దీంతో ఆమె ఫిజిక్  మొత్తం మారిపోయింది . కానీ బాగా నాజూగ్గా మార్చుకోవడానికి నానా తంటాలు పడుతుంది.  బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కల్కి సినిమాతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది .


అయితే ప్రభాస్ సినిమాలో మరొకసారి నటించబోతుంది దీపికా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ప్రభాస్ కి జోడిగా వన్ ఆఫ్ ద హీరోయిన్ క్యారెక్టర్ లో దీపిక పదుకొనే నటించబోతుందట . మొదటగా నయనతార - త్రిష లాంటి వాళ్ళ పేర్లు వినిపించిన వాళ్ళందరూ కాకుండా డిఫరెంట్ గా ఉండే హీరోయిన్ చూస్ చేసుకోవాలి అంటూ దీపికా పదుకొనేని చూస్ చేసుకున్నారట సందీప్ రెడ్డివంగా . గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్ ఓపెన్ గానే చెప్పాడు . తన ఫేవరెట్ హీరోయిన్ దిశా పటాన్ని అదేవిధంగా దీపిక పదుకొనే అని.. వాళ్లతో వర్క్ చేసే ఛాన్స్ వస్తే పదేపదే చేస్తూనే ఉంటాను అని .. అదే మాట నిజం చేస్తున్నాడు ప్రభాస్ . మరొకసారి దీపిక - ప్రభాస్ ని తెరపై చూడబోతున్నామని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: