సినిమా ఇండస్ట్రీలో మొదట ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మొదట ఓ సినిమాలో చిరంజీవిని తీసుకోవాలి అనుకున్న కూడా కొన్ని కారణాల వల్ల వేరే హీరోను తీసుకోగా ఆ సినిమా ఏకంగా అద్భుతమైన విజయాన్ని అందుకుందట. మరి రాఘవేంద్రరావు మొదట చిరంజీవిని ఏ సినిమాలో హీరోగా అనుకున్నాడు ..? ఆ తర్వాత ఎవరిని హీరోగా తీసుకొని అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు , మోహన్ బాబు హీరోగా అల్లుడు గారు అనే సినిమాని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కథ మొత్తం పూర్తికాకముందు రాఘవేంద్రరావు , చిరంజీవితో నేను నీ కోసం ఒక కథ తయారు చేస్తున్నాను అని చెప్పి చిన్న లైన్ గా ఓ కథను వినిపించాడట. స్టొరీ సూపర్ గా ఉంది సార్ మొత్తం తయారు చేయండి సినిమా చేద్దాం అని చిరంజీవి అన్నాడట. ఆ తర్వాత రాఘవేంద్రరావు ఆ సినిమా కథను మొత్తం తయారు చేశాడట. కథ మొత్తం తయారు అయ్యాక రాఘవేంద్రరావు , చిరంజీవికి ఫోన్ చేసి నీకు కొన్ని రోజుల క్రితం ఓ కథ చిన్న లైన్ గా చెప్పాను కదా గుర్తుందా అని రాఘవేంద్రరావు , చిరంజీవిని అడిగాడట. దానితో చిరంజీవి గుర్తుంది సార్ మొత్తం కంప్లీట్ అయ్యిందా సినిమా స్టార్ట్ చేద్దాం అని అన్నాడట. దానితో రాఘవేంద్రరావు కథ పూర్తి అయ్యింది. కానీ ఆ కథలో నీకంటే వేరే హీరో అయితే బాగుంటుంది అని అన్నాడట. దానితో ఎందుకు సార్ అని చిరంజీవి , రాఘవేంద్రరావుని ప్రశ్నించగా ..? ఆ మూవీ కథలో క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోయే సన్నివేశం ఉంటుంది. అలాంటి పాత్ర నీలాంటి స్టార్ ఈమేజ్ ఉన్న హీరో చేస్తే సెట్ కాదు. మామూలు ఈమేజ్ ఉన్న హీరోతో ఆ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పాడట. దానితో చిరంజీవి కూడా ఓకే అన్నాడట. ఇక మోహన్ బాబుతో అల్లుడు గారు అనే టైటిల్ తో ఆ కథతో ఆ మూవీ ని రూపొందించగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని కూడా అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: