
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సైతం జీ తెలుగు సొంతం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఆ ఛానల్, ఓటీటీకి శుభం సినిమాకు సంబంధించి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సమంత వెల్లడించినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు సమంత నటిగా కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
సమంత తన సొంత బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తూనే లాభాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని పాన్ ఇండియా సినిమాలలో ఆమె హీరోయిన్ గా నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత వేగంగా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు. సమంత రేంజ్ అంతకంతకూ పెరిగితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. స్టార్ హీరోయిన్ సమంత వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. సమంత సక్సెస్ ఫుల్ గా దశాబ్దానికి పైగా కెరీర్ ను కొనసాగించారు. సమంత రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగడం పక్కా అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.