టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా లైనప్ అదిరిపోయింది. వరుస విజయాలు సాధిస్తున్న బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అఖండ2 సినిమాతో బిజీగా ఉన్న బాలయ్యసినిమా తర్వాత గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ కానున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు బాలయ్య క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
 
ఈ సినిమాతోనే మోక్షజ్ఞ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే స్టార్ హీరో బాలయ్య లైనప్ లో మరో దర్శకుడు చేరారని తెలుస్తోంది. జైలర్2 సినిమాలో సైతం బాలయ్య కనిపిస్తారని ఈ సినిమాలో బాలయ్య కీలక పాత్రలో మెరవనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సక్సెస్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ బాలయ్యతో ఒక సినిమా తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
 
అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. బాలయ్య అధిక్ రవిచంద్రన్ కాంబోలో సినిమా ఫిక్స్ అయితే ఈ సినిమా తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య తన పారితోషికాన్ని సైతం ఒకింత భారీ స్థాయిలో పెంచేశారనే సంగతి తెలిసిందే.
 
సీనియర్ హీరోలలో 40 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్న బాలయ్య రాబోయే రోజుల్లో 50 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యంగ్ జనరేషన్ హీరోలకు సైతం ఎన్నో విషయాల్లో బాలయ్య స్పూర్తిగా నిలుస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బాలయ్య తన యాక్టింగ్ స్కిల్స్ తో ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య కెరీర్ ను అద్భుతంగా మలచుకుంటున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: