టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తోంది. ఇన్ని రోజుల పాటు ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా రామ్ కెరియర్ లో 22 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ను RAPO 22 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వచ్చారు. నిన్న ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టైటిల్ ను కన్ఫామ్ చేస్తూ ఈ మూవీ యొక్క టైటిల్ గ్లీమ్స్ వీడియో ను విడుదల చేశారు.

మూవీ టైటిల్ గ్లీమ్స్ వీడియో కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ యొక్క టైటిల్ గ్లీమ్స్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభించింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ మూవీ టైటిల్ గ్లీమ్స్ వీడియోకు విడుదల 24 గంటల్లో 11.52 మిలియన్ వ్యూస్ ... 184 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ గ్లీమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా రామ్ వరుస పెట్టి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఆయన చాలా కాలం తర్వాత నటిస్తున్న క్లాస్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో రామ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: