బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథలాజికల్ ఎపిక్ `రామాయణ`. దంగల్ వంటి విజయవంతమైన చిత్రాలకు ప్రసిద్ధి చెందిన
డైరెక్ట‌ర్ నితేష్ తివారీ తెర‌కెక్కిస్తున్న బాలీవుడ్ రామాయ‌ణ  రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా న్యాచుర‌ల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నారు. అలాగే `కేజీఎఫ్` సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కన్నడ యాక్టర్ యశ్ రావణుడిగా అలరించబోతున్నాడు.


ప్రస్తుతం బాలీవుడ్ రామాయణ చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రముఖ స్టార్ నటి కాజల్ అగర్వాల్ కూడా భాగం కాబోతుంద‌ని అంటున్నారు. ఆమె రావణుడి భార్యగా మండోదరి పాత్రలో కనిపించబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సినీ ప్రియులు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.


రామాయణంలోని మండోదరి ఒక ముఖ్యమైన పాత్ర. అటువంటి పాత్రకు అనుభవం ఉన్న కాజల్ సరిగ్గా న్యాయం చేస్తుందని సినీ లవర్స్ భావిస్తున్నారు. ఇక మండోద‌రి పాత్ర అంటే యష్ కి జోడిగా కాజల్ క‌నిపించ‌నుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసుకునేందుకు ఫాన్స్ ఉత్సాహం చూపుతున్నారు. 1986 జనవరి 8న హీరో యష్ జన్మించారు. అలాగే కాజ‌ల్ అగ‌ర్వాల్‌ 1985 జూన్ 19న జన్మించింది. ఇద్దరికీ 39 సంవత్సరాలే.. య‌ష్‌-కాజ‌ల్ మ‌ధ్య‌ కేవలం కొన్ని నెలల గ్యాప్ మాత్రమే ఉంది. దీంతో ఆన్ స్క్రీన్ పై యష్‌, కాజ‌ల్ జంట పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫాన్స్ అభిప్రాయపడ‌టం గ‌మ‌నార్హం. కాగా, బాలీవుడ్ రామాయ‌ణకు ఏడు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డబుల్ నెగటివ్ కంపెనీ విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తోంది. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతున్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహ్మాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: