సినీ పరిశ్రమలో ఎన్నో పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాటిలో అల్లు కుటుంబం ఒకటి. అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని తరాల నుంచి అల్లు కుటుంబం సినీ పరిశ్రమకు ఎనలేని సేవలను అందించారు. అల్లు కుటుంబం నుంచి ఎంతోమంది సినీ పరిశ్రమకు హీరోలుగా, ప్రొడ్యూసర్లుగా పరిచయమయ్యారు. అలాంటి వారిలో అల్లు శిరీష్ ఒకరు. అల్లు శిరీష్ హీరోగా మాత్రమే కాకుండా, గీత ఆర్ట్స్ సంస్థకు కో-ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. 

హీరో బాలనటుడిగా మొదట తమిళ సినిమాలలో నటించాడు. అనంతరం తెలుగు, మలయాళం, తమిళంలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ తెలుగులో ఈ హీరో నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ శిరీష్ పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాడు. ఇప్పటివరకు అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, కొత్తజంట, గౌరవం, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబిసిడి, బడ్డీ లాంటి అనేక సినిమాలలో నటించాడు. ఈ సినిమాలలో కొన్ని సక్సెస్ సాధించగా మరికొన్ని విఫలమయ్యాయి. అలాంటి సినిమాలలో ఊర్వశివో రాక్షసివో సినిమా ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇందులో అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా అను ఇమాన్యుల్ నటించింది. ఈ సినిమా 2022లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఉన్న రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అందులో అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమాన్యుల్ ను గట్టిగా కిస్ చేస్తాడు. హీరోయిన్ ను రిక్వెస్ట్ చేసే క్రమంలో అల్లు శిరీష్ గట్టిగా లిప్ లాక్ ఇస్తాడు. అప్పుడు కోపంతో అను హీరో శిరీష్ చెంప పైన కొడుతోంది. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో చిత్రీకరించగా ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం శిరీష్ పలు సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: