
ఇటీవలే `జాట్` చిత్రంతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. నార్త్ ప్రేక్షకులను జాట్ విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. అయిటే గోపీచంద్ మలినేని అటు జాట్‌తో హిట్ అందుకున్నాడో లేదో.. అప్పుడే ఇటు బాలయ్య సినిమా పనులు మొదలు పెట్టేశారు. ఆల్రెడీ కథ సిద్ధంగా ఉండడంతో బాలయ్య ఇమేజ్ గా తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. ఇక జూన్ 8న ఈ చిత్రాన్ని ప్రారంభించాలని సన్నాహాలు జరుగుతున్నాయి.
అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. మూడు నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేసేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది ఆరంభంలోనే బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ `అఖండ 2-తాండవం`తో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న అఖండ 2 మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు