
కాగా అలనాటి నటీమణుల మినియేచర్ ఫోటోలతో కూడిన ముత్యాల దండను జడకు సింగారించుకొని బాలీవుడ్ నటి నితాన్షి అందరి చూపులు తన వైపుకు తిప్పుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు మరో నటి రుచి గుజ్జర్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అయ్యేలా చేస్తుంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫోటోలతో కూడిన నెక్లెస్ ని ధరించి అందరిని ఆకర్షించే ప్రయత్నం చేసింది . కానీ అది బెడిసి కొట్టింది . నరేంద్ర మోడీ ఫోటోలను నెక్లెస్ రూపంలో చేసుకొని ఆమె ధరించింది .
అయితే అది కొంచెం వల్గర్ గా ఉంది అంటున్నారు జనాలు . ఆమె డీప్ నెక్ తో వేసుకున్న డ్రెస్ కారణంగా నరేంద్ర మోడీ ఫోటోలు ఆమె గుండెకు హత్తుకున్నట్లు ఉంటాయి. దీంతో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా..? అంటూ కొంతమంది ఆమెను బూతులు తిడుతున్నారు . ప్రధాని మోదీపై గౌరవంతో కేన్స్ లో అలా నెక్లెస్ ధరించింది అంటూ రుచి మీడియాకు చెప్పారు . కానీ ఆమె మాటలను మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు . దేశానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది . దేశ పెద్దలకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అంటూ చాలామంది జనాలు ఆమెను తిడుతున్నారు. మిస్ హర్యానా 2023 విజేత అయిన రుచి పలు మ్యూజిక్ వీడియోలలో .. హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది . అలాంటి క్రేజ్ ఉన్న నటి నరేంద్ర మోడీ ఫోటోలను ఇలా చేసి గుండెలపై పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అభిమానులు . నరేంద్ర మోడీ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు..!