కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే మైసూర్ శాండిల్ సబ్బుకు మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. అయితే మైసూర్ శాండిల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నటి తమన్నాను నియమించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా మైసూర్ శాండిల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ కర్ణాటక నటులను ఎందుకు ఎంపిక చేయలేదని కన్నడ నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఈ వివాదంపై కర్ణాటక మధ్య తరహ పరిశ్రమల మంత్రి ఎం.బి పాటిల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 

ఆ పోస్టులో కన్నడ సినీ పరిశ్రమపై తమకు చాలా గౌరవం ఉందని ఆయన తెలిపారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ సంస్థ ఉనికిని విస్తరించాలని అన్నారు. అందుకే పాన్ ఇండియా సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక  చేయాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే తమన్నాని ఎంపిక చేయడానికి నాలుగు కారణాలు ఉన్నాయని మంత్రి పాటిల్ వెల్లడించారు. 

స్టార్ హీరోయిన్ తమన్నా కెనడతో పాటుగా తెలుగు, హిందీ, తమిళం సినీ పరిశ్రమలలో కూడా నటించారని తెలిపారు. ఆమెకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉందని చెప్పారు. అంతేకాకుండా తమన్నా భాటియాకి ప్రొఫెషనల్ బ్రాండింగ్ అనుభవం ఉందని అన్నారు. ఇంతకుముందు తమన్నా బ్యూటీ మరియు స్కిన్ కేర్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారని స్పష్టం చేశారు. తమన్నా ఎంపిక మార్కెటింగ్ నిపుణుల ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే జరిగిందని అన్నారు. నటి తమన్నా కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఉత్పత్తుల తయారీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం కోసం రూ. 6.2 కోట్ల తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు ఉంటుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: