పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్ లు జూన్-1 నుండి బంద్ అనే విషయంపై చాలా ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో ఎంతోమంది నిర్మాతలు తోకముడుస్తున్నారు.తప్పు చేశామనిని లోలోపల కుమిలిపోతున్నారు. కానీ చేసేదేమీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పటినుండి వ్యక్తిగత చర్చలు బంద్ అని.. ఇలాంటి నేపథ్యంలో తాజాగా సినీ నిర్మాత అయినటువంటి నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత నట్టి కుమార్ ఓ ఛానల్ కి ఇచ్చిన డిబేట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కుట్ర చేసింది ఆ ముగ్గురే అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ వీరమల్లు మూవీ పై కుట్ర చేసినా ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం.. నట్టి కుమార్ ఓ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాని తొక్కేయాలని చాలామంది చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన భీమ్లా నాయక్ సినిమా విడుదలైన సమయంలో నేను ఒక 20, 30 థియేటర్ల దగ్గరికి వెళ్లాను.ఆ టైంలో వైసిపి అధికారంలో ఉంది.

అంతేకాదు అప్పుడు నేను వైసీపీకి సపోర్టర్ గా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని చెబుతున్నాను. ఎందుకంటే భీమ్లా నాయక్ సినిమా విడుదలైన సమయంలో చాలామంది ఎంఆర్ఓ లు, వీఆర్వోలు సినిమా హిట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వంద రూపాయల టికెట్ ని 35 రూపాయలకు,ఐదు రూపాయలకు బ్లాక్ లో అమ్మేశారు.ఇది నేను స్వయంగా చూశాను. అయితే అప్పుడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకంగా చేసింది దాన్ని ఒప్పుకుంటాను. కాని ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాని తొక్కేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి నుండి ద్వారంపూడి చంద్రశేఖర్  రెడ్డి నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాని తొక్కేయాలని కుట్ర పన్నుతున్నారు. వీరు ముగ్గురు అందులో భాగమయ్యారు.

ఇది నేను వారి మీద కక్షతోనో లేదా వాళ్ళంటే  పడకనో పవన్ కళ్యాణ్ అంటే ప్రేమనో అని చెప్పడం లేదు ఇది వాస్తవం. హరి హర వీరమల్లు సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది.నిర్మాత ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని తెలుసు. సినిమా కాస్ట్ ఆఫ్ బడ్జెట్ పెరిగింది అని తెలుసు..అయినా కూడా ఇలా పవన్ కళ్యాణ్ సినిమాపై కుట్రకోణం చేయడం మాత్రం మంచిది కాదు. ఇది నాకు వారి మీద కక్షతోని చెప్పడం లేదు. ఇది నిజం అంటూ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడడంతో చాలా మంది నెటిజన్లు దగ్గుబాటి సురేష్ బాబు నూ పక్కన పెట్టి అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే రాజకీయంగా చూడవచ్చు. కానీ అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ఇంట్లో వాడే..అలాంటిది పవన్ కళ్యాణ్ ని ఇంట్లో వాడే దెబ్బతీయాలని చూస్తున్నాడు అంటూ నట్టి కుమార్ కామెంట్లపై చాలామంది నెటిజన్లు మాట్లాడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: