
హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతున్నది.ఈ సినిమాని కుట్రతో తొక్కేయాలని చూస్తున్నారనే విధంగా మంది ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ విషయం పైన విచారణ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ విషయం మీద కొంతమంది నిర్మాతలు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సంచలన స్టేట్మెంట్స్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్య పోయారు.
కానీ గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమ రాజకీయాలతో నలిగిపోతోందని దీనివల్ల నిర్మాతలు ,ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెరపైకి ఆ నలుగురు అంశం అనే విషయంపై కొంతమంది నిర్మాతల పేర్లు కూడా వినిపించాయి.. ముఖ్యంగా అల్లు అరవింద్ పేరు కూడా రావడంతో తాజాగా ఈ అంశం పైన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో గీత ఆర్ట్స్ కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడబోతున్నట్లు సమాచారం. మరి ఈ నలుగురు అనే అంశంపై అల్లు అరవింద్ ఏ విధంగా మాట్లాడుతారు అన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠ పరిచేలా కనిపిస్తోంది. అల్లు అరవింద్ తో పాటు కొంతమంది నిర్మాతలు, పొలిటికల్ లీడర్ల పేర్లు కూడా వినిపించాయి.