
ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో విజయాలు అందుకున్న శేఖర్ కమ్ముల కుబేర సినిమాతో ఆ సినిమాలను మించిన విజయాన్ని అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక ఈ సినిమాలో డీ గ్లామరస్ లుక్ లో నటిస్తున్నారు. నాగార్జున, ధనుష్ యాక్టింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
టీజర్ లోని కొన్ని షాట్స్ బిఛగాడు సినిమాను గుర్తు చేసే విధంగా ఉండటం గమనార్హం. స్టోరీ లైన్ ను రివీల్ చేయకపోయినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగించే విషయంలో మాత్రం మేకర్స్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ధనుష్, రష్మిక, నాగ్ కష్టానికి గ్రేట్ అనాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నాగార్జున ధనుష్ కాంబో సీన్స్ ను అద్భుతంగా ప్లాన్ చేసినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. నాగార్జున కెరీర్ లో కుబేర స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ ఉంది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. విడుదలకు ముందే ఈ సినిమా లాభాలను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అతి త్వరలో కుబేర సినిమాకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. కుబేర టీజర్ వ్యూస్ విషయంలో అదరగొడుతోంది.