
అలాగే సినిమా చూడాలంటే థియేటర్లోనే చూడాలి .. ఇక సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత యూట్యూబ్లో అందుబాటులోకి రానుంది .. కానీ ఇది పే ఫర్ వ్యూ .. ఆప్షన్తో అంటే సినిమా చూడాలంటే కొంత నిర్దిష్టమైన డబ్బులు పెట్టాల్సి ఉంటుంది .. ఒక విధంగా అమీర్ చేస్తున్న ఓ ఖరీదైన ప్రయోగం ఇది .. ఓటిటి రూపంలో మంచి మొత్తాన్ని వదులుకుంటూ పెద్ద రిస్కు చేస్తున్నాడు ... ‘సితారే జమీన్ పర్’ లాంటి సినిమాని ఓటిటికి అమ్మితే మంచి లాభాలు వస్తాయి .. అలాగే పెట్టుబడి మొత్తం అక్కడి నుంచే తెచ్చుకోవచ్చు .. విడుదలకు ముందే సేఫ్ కావచ్చు కానీ ఆమీర్ ఇలా ఆలోచించలేదు .. తనకు ఓటిటి మార్కెట్ లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు .. తన సినిమాని ప్రేక్షకులు థియేటర్లోనే చూడాలని గట్టిగా చెబుతున్నాడు ..
ఇక ఇప్పటివరకు ఓటీటీలో సినిమా వస్తుంటే .. అప్పుడు చూసుకుందామని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు .. ఇప్పుడు ఓటీటీలో రాకపోతే ఓ మంచి సినిమాని మిస్ అవుతాం కదా అనే ఫీలింగ్ వస్తే .. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్కు వెళతారు .. ఇది అమీర్ ఖాన్ ఆలోచన .. అలాగే పే పర్ వ్యూ కూడా మంచి ఆప్షన్ ఏ అని ఓటీటీలు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు కానీ యూట్యూబ్ అలా కాదు .. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి సినిమా బాగుందన్న టాక్ వస్తే 8 వారాల తర్వాత యూట్యూబ్లో చూసుకొనే అవకాశం ఉంటుంది .. అమీర్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి .. ఒకవేళ ఓటీటీల రూపంలో వచ్చే ఆదాయం యూట్యూబ్లో వస్తుంటే .. అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు .. అప్పుడు ఓటీటీ దూకుడుకు చెక్ పడుతుంది అన్నడంలో ఎలాంటి సందేహం లేదు .