ఒక సినిమాను 5 సంవత్సరాలు తీసి ఆసినిమా విడుదల అనేకసార్లు వాయిదా పడినతరువాత ఆసినిమా పై క్రేజ్ ఉండటం ఎక్కడా కనిపించదు. అయితే పవన్ రాజకీలలోకి వచ్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి హోదాలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితులలో ‘హరి హర వీరమల్లు’ మూవీ పై పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడ ఈసినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.


ఈమూవీ కథ చారిత్రాత్మకం కావడంతో ఎంతవరకు ఈసినిమా సగటు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలను కొందరు వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చారిత్రాత్మక కథ అయినప్పటికీ సినిమాను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించగలిగితే ఆసినిమా బ్లాక్ బష్టర్ అవుతుందని గతంలో వచ్చిన కొన్ని సినిమాలు నిరూపించాయి.


ముఖ్యంగా బాలీవుడ్ లో విడుదలైన ‘పద్మావత్’ ‘జోధా అక్బర్’ ‘బాజీరావు మస్తానీ’ సూపర్ హిట్ అవ్వడంతో సినిమా బాగుంటే అది చారిత్రాత్మకమా లేదా జానపదమా సాంఘీకమా అన్న విషయాలను పట్టించుకోకుండా సినిమాను బ్లాక్ బష్టర్ హిట్ చేసిన ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు జూన్ 12న విడుదల కాబోతున్న ఈమూవీ కథలో దర్శకుడు జ్యోతి కృష్ణ చాల మార్పులు చేర్పులువార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి దర్శకుడు క్రిష్ వ్రాసుకున్న కథలో జ్యోతి కృష్ణ అనేక మార్పులు చేయడమే కాకుండా ప్రస్తుతం పవన్ కు ఏర్పడ్డ రాజకీయ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అనేక సన్నివేశాలు జ్యోతి కృష్ణ ఈమూవీలో క్రియేట్ చేశాడు అని అంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలఉ ‘హరి హర వీరమల్లు’ కలక్షన్స్ పరంగా పెను సంచలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి సంగీతం విషయంలో దర్శకుడు కీరవాణి ఈమూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చాల శ్రద్ద పెట్టినట్లు టాక్. ఈమూవీకి సరిగ్గా ఒక వారం ముందు కమలహాసన్ మణిరత్నంల మూవీ ఆశించిన స్థాయిలో కలక్షన్స్ రాబట్టకవపోతే కేవలం ఒక్క వారం గ్యాప్ లో వస్తున్న పవన్ సినిమాకు ఆకాశమే హద్దు అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: